News August 25, 2024
కోల్‌కతా ఘటన.. నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ పూర్తి

కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. జైల్లోనే అతనికి లై డిటెక్టర్ టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులకు సీబీఐ ఆఫీసులో పరీక్షలు నిర్వహించారు. నిందితులు ఏం చెప్పారనేది గోప్యంగా ఉంచారు. RG కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న మరో ఐదుగురికి నిన్న లై డిటెక్టర్ టెస్టులు చేశారు.
Similar News
News December 3, 2025
జగిత్యాల: ‘ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు’

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం ఆమె కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఎన్నికల పరిశీలకులు రమేష్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News December 3, 2025
T20 వరల్డ్ కప్‌కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్‌పూర్‌లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్వెయిల్ చేశారు. ‘టీమ్‌కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.
News December 3, 2025
టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్ రీఎంట్రీ

సౌతాఫ్రికాతో ఈ నెల 9 నుంచి జరగనున్న 5 మ్యాచుల టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న గిల్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. ఫిట్‌నెట్‌ను బట్టి ఆయన ఆడే అవకాశాలుంటాయని బోర్డు తెలిపింది.
టీమ్: సూర్య కుమార్(కెప్టెన్), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్ పాండ్య, దూబే, అక్షర్, జితేశ్ శర్మ, శాంసన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్


