News March 30, 2024
ఆర్సీబీకి కొరకరాని కొయ్యగా కోల్‌కతా

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తన రికార్డు నిలబెట్టుకుంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా బెంగళూరుపై నెగ్గింది. సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2016 నుంచి చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతాకు ఓటమే ఎదురుకాలేదు. ఈ స్టేడియం కేకేఆర్‌కు సొంత మైదానంలా మారింది.
Similar News
News December 4, 2025
నష్టపోయేది అమెరికా, యూరప్‌లే: జైశంకర్

వలస నిబంధనలను కఠినతరం చేస్తే US, యూరప్ తమ సొంత ప్రయోజనాలనే దెబ్బతీసుకునే ప్రమాదం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘ప్రతిభను ఉపయోగించుకోవడం పరస్పర ప్రయోజనానికి దోహదపడుతుంది. దీనిపై వారిని ఒప్పించడమే సమస్య. టాలెంట్ కలిగిన వారిని రానివ్వకపోతే నికరంగా నష్టపోయేది వాళ్లే’ అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అవకాశాలను స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చని, ప్రభుత్వాలు వారిని అడ్డుకోలేవని చెప్పారు.
News December 4, 2025
డ్రై స్కిన్ కోసం మేకప్ టిప్స్

పొడి చర్మం ఉన్నవారు మేకప్ వేసుకోవాలనుకుంటే ముందుగా సీరం అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కచ్చితంగా అవసరం. చర్మం పొడిగా, డీహైడ్రేటెడ్‌గా ఉంటే.. హైడ్రేటింగ్ ప్రైమర్‌ను ఎంచుకోవాలి. ఇది మీ మేకప్ లుక్‌ని హైడ్రేటింగ్ బేస్‌గా ఉపయోగించవచ్చు. పొడి చర్మం కోసం ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు హైడ్రేటింగ్, తేలికైన, మెరిసే లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. ఫౌండేషన్ పైన క్రీమ్ బ్లష్, హైలైటర్లను ఉపయోగించాలి.
News December 4, 2025
తాజ్‌మహల్ ఆగ్రాకు శాపంగా మారింది: బీజేపీ ఎంపీ

తాజ్‌మహల్‌పై బీజేపీ ఫతేపూర్ సిక్రి(UP) ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాజ్‌మహల్ కట్టడం ప్రపంచ ఆకర్షణ. కానీ కఠినమైన తాజ్ ట్రాపేజియం జోన్(TTZ), ఎన్జీటీ నిబంధనల వల్ల ఆగ్రా అభివృద్ధికి శాపంగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి ఆటంకం కలిగిస్తోంది’ అని లోక్‌సభలో అన్నారు. ఉపాధి, అభివృద్ధిని పెంచేందుకు, తాజ్ అందాన్ని కాపాడేందుకు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.


