News August 23, 2024
కోల్‌కతా హత్యాచార ఘటన: నిందితుడికి మరో 14 రోజుల కస్టడీ

కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో లేడీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌ని కోర్టు కస్టడీకి పంపింది. అదనపు చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి మరో 14 రోజుల కస్టడీ విధించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో న్యాయం కోరుతూ 11 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన చేస్తున్న స్థానిక వైద్యులు ఈరోజు తిరిగి విధుల్లోకి చేరడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News October 25, 2025
SBI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్‌న్యూస్

క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీల పెంపునకు SBI సిద్ధమైంది. వీటి ద్వారా వాలెట్లలో రూ.1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ పడనుంది. ఎడ్యుకేషన్ ఫీజులను థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించినా 1% రుసుము విధించనుంది. అయితే స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లు, POS మెషీన్ల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. పెంచిన ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
News October 25, 2025
ఇంజినీరింగ్ అర్హతతో NHIDCLలో 34 పోస్టులు

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. వెబ్సైట్: https://www.nhidcl.com/
News October 25, 2025
ఇంటర్లో ఇంటర్నల్ విధానంతో మరిన్ని సమస్యలు: GJLA

TG: INTERలో 20% ఇంటర్నల్, 80% ఎక్స్టర్నల్ మార్కుల విధానం వల్ల ప్రమాణాలు పడిపోతాయని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ వల్ల ప్రాక్టికల్స్ ప్రహసనంగా మారాయి. ఇంటర్నల్ మార్కుల విధానం పెడితే ఆ సంస్థలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. ప్రమాణాలు మరింత దిగజారుతాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి’ అని సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.


