News December 30, 2024

కోమటిరెడ్డికి ఆ అర్హత లేదు: వినోద్ కుమార్

image

TG: బీఆర్ఎస్ సర్కారు చేసిన మంచి పనుల్ని విమర్శించే అర్హత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదని ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తాజాగా తేల్చిచెప్పారు. ‘మా అధినేత కేసీఆర్ చాలా ముందుచూపుతో రీజినల్ రింగ్ రోడ్ ఆలోచన చేశారు. నగరానికి వచ్చే పది హైవేలను అనుసంధానించేలా అలైన్‌మెంట్ రూపొందించారు. దీనిపై జాతీయ హైవేల అధికారులతోనూ చర్చించారు. మా ప్రభుత్వం అభివృద్ధి చేయలేదనడం సరికాదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 2, 2025

‘గేమ్ ఛేంజర్‌’కు తమిళంలో గట్టి పోటీ

image

కోలీవుడ్‌లో సంక్రాంతి బరి నుంచి అజిత్ సినిమా ‘విదాముయర్చి’ తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’కు అక్కడ పోటీ లేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ భావించారు. అయితే, కోలీవుడ్ స్టార్స్ సినిమాలు లేకపోవడంతో ఏకంగా ఆరు చిన్న సినిమాలు తమిళంలో సంక్రాంతికి వస్తుండటం గమనార్హం. వనంగన్, కాదలిక్కు నేరమిల్లై, టెన్ అవర్స్, పదవి తలైవన్, మద్రాస్ కారన్, తరుణం, సుమో తదితర సినిమాలు పండగ బరిలో గేమ్ ఛేంజర్‌కు పోటీగా రానున్నట్లు తెలుస్తోంది.

News January 2, 2025

నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం జిందాల్ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ కావొచ్చని సమాచారం. చెత్త నుంచి ఇంధనాన్ని సృష్టించే ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News January 2, 2025

దయచేసి మద్యం మానేయండి: వినోద్ కాంబ్లీ

image

ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మద్యపానం మానేయాలని అందర్నీ కోరారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మేరకు ఆయన క్రికెట్ అభిమానులకు సూచించారు. ‘మద్యం, డ్రగ్స్ రెండూ జీవితాన్ని నాశనం చేస్తాయి. దయచేసి వాటిని మానుకోండి. జీవితం చాలా అందమైనది. దాన్ని ఎంజాయ్ చేయండి కానీ నాశనం చేసుకోకండి. త్వరలోనే నేను మామూలు స్థితికి చేరుకుంటా. నాకు ఆ ధీమా ఉంది’ అని వ్యాఖ్యానించారు.