News January 19, 2025

నేటి నుంచి కొమురవెల్లి జాతర

image

TG: నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర మొదలవనుంది. 2 నెలల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకు ఈ జాతర జరగనుంది. ఇవాళ తొలి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు బోనాలు, పట్నాలతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు.

Similar News

News January 8, 2026

తిలక్ వర్మకు సర్జరీ? న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం!

image

స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ NZతో జరిగే T20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్‌లో చేరిన ఆయనకు డాక్టర్లు సర్జరీ సూచించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. కోలుకోవడానికి 3-4 వారాలు పడుతుందని సమాచారం. ఫిబ్రవరి 7న జరిగే T20 వరల్డ్ కప్ కల్లా తను ఫిట్ అవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆందోళనగా మారింది. తిలక్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి!

News January 8, 2026

మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

image

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

13 మంది ప్రాణాలు తీసిన ఏనుగు

image

ఝార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. 2 రోజుల్లోనే 13 మందిని చంపేయగా, మరో నలుగురు గాయపడ్డారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ‘5వ తేదీన కోల్హాన్‌లో ఏనుగు దాడిలో ఏడుగురు, 6న నోవాముండి, హటగమారియలో ఆరుగురు మృత్యువాతపడ్డారు’ అని చెప్పారు. ఆ గజరాజును అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అక్కడ గత DEC 16 నుంచి ఏనుగుల దాడిలో 22 మంది ప్రాణాలు వదిలారు.