News October 9, 2025

కోనసీమ దుర్ఘటన.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

image

AP: కోనసీమ(D) రాయవరంలో బాణసంచా పేలి 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పేలుడుకు గల కారణాలు, బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది. విచారణ అధ్యయన నివేదికను వారంలోగా సమర్పించాలని ఆదేశించింది.

Similar News

News October 9, 2025

వరిలో గింజ నాణ్యత పెరగడానికి ఇలా చేయండి

image

చిరుపొట్ట దశలో ఉన్న వరిలో గింజ నాణ్యత, బరువు పెరగడానికి, తెగుళ్లు, పురుగులను తట్టుకునే శక్తి పెంపొందించడానికి పలు చర్యలు తీసుకోవాలి. చివరి దఫాగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20-25 కేజీల చొప్పున సిఫారసు చేసిన నత్రజని ఎరువును వేసుకోవాలని వరి శాస్త్రవేత్త గిరిజారాణి చెబుతున్నారు. ముదురు నారు వేసిన పొలాల్లో తప్పనిసరిగా సిఫారసు చేసిన ఎరువులను 25 శాతం పెంచి వేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 9, 2025

రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. అల్లూరి, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే.

News October 9, 2025

బొంతుకు బీజేపీ టికెట్ ఇవ్వాలి.. ప్రతిపాదించిన అర్వింద్

image

TG: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కీలక పరిణామం చోటు చేసుకుంది. బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. బొంతును పార్టీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు రామ్‌చందర్ రావును కోరారు. ఆయనకు ABVP బ్యాగ్రౌండ్ ఉందని గుర్తు చేశారు. కాగా బొంతు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడ నవీన్ యాదవ్‌కు అధిష్ఠానం టికెట్ కేటాయించింది.