News October 15, 2024

కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్

image

TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్‌లను అరెస్ట్ చేశారు.

Similar News

News February 17, 2026

AIIMS రిషికేశ్‌లో ఉద్యోగాలు

image

<>AIIMS<<>> రిషికేశ్‌ 5 డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD, MSఅర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.3000, SC అభ్యర్థులకు రూ.500, PwBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsrishikesh.edu.in

News February 17, 2026

గుడ్‌న్యూస్.. వారికీ ఇందిరమ్మ ఇళ్లు!

image

TG: ఉమ్మడి APలో, గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పూర్తికాని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద సాయం చేయాలని నిర్ణయించింది. గతంలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ దాకా కట్టగానే ప్రభుత్వాలు మారడంతో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇలాంటి వాళ్లు 9 వేల మంది వరకు ఉన్నారని తేలింది. బేస్‌మెంట్ ఖర్చు రూ.లక్ష మినహాయించి, మిగతా రూ.4 లక్షల దాకా ప్రభుత్వం వారికి అందజేయనుంది.

News February 17, 2026

అధిక మాసంలో ఏమేం చేయవచ్చు?

image

అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అంటారు. ఇది ఆధ్యాత్మిక సాధనకు మహత్తర సమయం. ఈ మాసానికి విష్ణువు అధిపతి. అందుకే జపతపాలు, ధ్యానానికి ప్రాధాన్యం. ఆయన నామస్మరణతో కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ఆత్మదర్శనానికి, భగవంతుని స్మరించడానికి ఇది అనుకూలమైన కాలం. ఈ మాసంలో శక్తి మేరకు అన్నదానం, విద్యాదానం చేయడం విశేష పుణ్యప్రదం. కొత్త శుభకార్యాలు నిషిద్ధమైనా, నిరంతర భగవన్నామ స్మరణతో, దానధర్మాలతో దైవకృపను పొందవచ్చు.