News December 16, 2024
ఆ ప్రాంత రైతులకు కొండా సురేఖ సూచన

అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల రైతులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4లోపు పొలం పనులు చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. సోమవారం మండలిలో ఆమె మాట్లాడుతూ శీతాకాలంలో వన్యప్రాణుల సంచారం అధికంగా ఉండడంతో, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారు ప్రమాదాల బారినపడుతున్నారని వివరించారు. Man-Animal Conflict బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Similar News
News October 14, 2025
ప్రధాని కర్నూలు పర్యటనను ఖరారు చేసిన పీఎంవో

AP: ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనపై PMO అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. 11.15amకు శ్రీశైలం ఆలయంలో పూజలు చేసి, 12:15pmకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారని పేర్కొంది. 2:30pmకు కర్నూలులో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపనతో సహా రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించింది.
News October 14, 2025
‘స్కాలర్షిప్స్ రాలేదు.. జీతాలు ఇవ్వలేం’

TG: ఉన్నత విద్యాసంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాయి. దాదాపు 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు విడుదల కాలేదని, వచ్చిన తర్వాతే ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే 50% కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం Way2Newsకు గోడు వెల్లబోసుకుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అడ్మిషన్లూ కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.
News October 14, 2025
దీపావళి.. శునకాలకు ప్రత్యేక పూజలు చేస్తారు!

నేపాల్లో దీపావళి సందర్భంగా ఐదు రోజుల తిహర్ జరుపుకుంటారు. ఇందులో భాగంగా రెండో రోజు శునకాలను పూజిస్తుంటారు. మానవుల పట్ల శునకాలు చూపించే విశ్వసనీయతకు కృతజ్ఞతలు చెప్పడానికి దీనిని పాటిస్తారు. వీధి, పెంపుడు కుక్కలనే తేడా లేకుండా అన్ని శునకాలకూ పూలమాలలు వేసి నుదిటిపై తిలకం దిద్దుతారు. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించి గౌరవిస్తారు. ఈ సంస్కృతి నేపాలీ ప్రజల జంతు ప్రేమను చాటుతుంది.