News March 11, 2025
సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ

TG: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో <<15712556>>తెలంగాణ<<>> ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని AP CM చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ‘టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంటుంది. వారి తీరుతో ప్రజాప్రతినిధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలి’ అని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 12, 2025
శాసనమండలిలో వైసీపీ నిరసన

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.
News March 12, 2025
సాయంకాలం వాకింగ్ చేస్తున్నారా?

వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాత్రి పూట నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ప్రతి రోజూ అరగంట నడిస్తే మెదడు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా రక్తపోటు సమస్య రాదు. సాయంకాలపు నడకతో శరీరంలోని కండరాలు బలపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు.
News March 12, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.