News July 30, 2024
లోక్‌సభలో బీజేపీ విప్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

TG: లోక్‌సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. ఆయనతోపాటు మరో 16 మందిని విప్‌లుగా ఎంపిక చేసింది. ఆ పార్టీ చీఫ్ విప్‌గా పశ్చిమ్ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్‌ను నియమించింది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ శివ్ శక్తినాథ్ బక్షి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందించారు.
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.


