News August 22, 2025
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ కూనంనేని

TG: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు. HYD గాజులరామారంలో జరిగిన సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పేరును పార్టీ నేత వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, మరో నేత శంకర్ బలపరిచారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సాంబశివరావు ప్రస్తుతం కొత్తగూడెం MLAగా ఉన్నారు.
Similar News
News August 23, 2025
SA టీ20 లీగ్‌కు 13 మంది భారత ఆటగాళ్లు

వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానున్న SA టీ20 లీగ్‌లో 13 మంది భారత ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. పీయూష్ చావ్లా, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, వెంకటేశ్ గాలిపెల్లి, మహేశ్ అహిర్, సరుల్ కన్వర్, అనురీత్ సింగ్ కతూరియా, నిఖిల్ జగా, కేఎస్ నవీన్, ఇమ్రాన్ ఖాన్, అతుల్ యాదవ్, అన్సారీ మరూఫ్, మహమ్మద్ ఫైద్ వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. పీయూష్ తప్ప, మిగతా వారందరి బేస్ ప్రైజ్ రూ.10 లక్షలుగా ఉంది.
News August 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: తుమ్మల

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని స్థానిక నేతలకు ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ బూత్ లెవెల్ నేతలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘ఈ ఎన్నికపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ప్రతీ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ఇంటింటికీ వివరించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
News August 23, 2025
కేంద్ర మంత్రి కుమారుడిని ముద్దాడిన చంద్రబాబు

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులకు జన్మించిన కుమారుడిని సీఎం చంద్రబాబు ముద్దాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎం రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆ చిన్నారికి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం వారి బాగోగులు తెలుసుకున్నారు.