News June 4, 2024
నెల్లూరు రూరల్లో స్వల్ప ఆధిక్యంలో కోటంరెడ్డి

AP: నెల్లూరు రూరల్ TDP ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1,369 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. YCP అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. అలాగే ఆత్మకూరులో YCP అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 1,711 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్ 55 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News September 13, 2025
మైథాలజీ క్విజ్ – 4

1. అర్జునుడు తపస్సు చేసి, ఎవర్ని ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని పొందాడు?
2. శూర్పణఖ ఎవరి చెల్లి?
3. ‘త్రిసూర్ పురం’ అనే పండగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ‘నవకళేబర’ ఉత్సవం ఏ ఆలయంలో జరుగుతుంది?
5. హిరణ్యాక్షుణ్ని వధించిన విష్ణు అవతారం ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను ‘మైథాలజీ క్విజ్-5’(రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
News September 13, 2025
నేడు మణిపుర్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.
News September 13, 2025
ఈనెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

TG: దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.