News March 17, 2024

ప్రధాని మోదీ స్పీచ్‌లో ‘కోటప్పకొండ’ ప్రస్తావన

image

చిలకలూరిపేట బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్నాడులోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండను ప్రస్తావించారు. అక్కడ ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి ఉందని ఆయన తెలియజేశారు. మోదీ హిందీలో ప్రసంగించగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు.

Similar News

News March 29, 2025

ఇప్పటికీ ఈ ఫొటో మర్చిపోలేనిది

image

సీనియర్ NTRకు తెనాలితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటికీ ఈ ఫొటో చూస్తే ఎన్టీఆర్ అభిమానులకు ఆయన రాజకీయ వైభవం గుర్తుకు వస్తుంది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రచారంలో భాగంగా 1982లో తెనాలి మార్కెట్‌లోని మున్సిపాలిటీ బిల్డింగ్ వద్ద ఆయన సభ నిర్వహించారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఇది. ఆ సభకు తెనాలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి  లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ సభలో తన ప్రసంగంతో NTR ప్రజలను ఆకట్టుకున్నారు. 

News March 29, 2025

గుంటూరు: పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్‌ల పేరుతో మోసాలు జాగ్రత్త: ఎస్పీ

image

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్‌ల పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల పట్ల గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. లైక్, షేర్ చేస్తే రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతారని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. 

News March 29, 2025

గుంటూరు మిర్చి యార్డుకు సరుకు తీసుకు రావద్దు

image

గుంటూరు మిర్చి యార్డుకు రైతులు ఎవరూ సరుకు తీసుకు రావద్దని యార్డు అధికారులు శుక్రవారం తెలిపారు. యార్డుకు మూడు రోజులు సెలవులు ఇచ్చినట్లు తెలిపారు. ఈరోజు, ఆదివారం యార్డుకు వీక్ ఎండ్ సెలవులు ఇవ్వగా.. సోమవారం రంజాన్ సందర్భంగా సెలవు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మిర్చి యార్డ్‌కు బస్తాలు తీసుకురావద్దని అన్నారు. తిరిగి మరలా యార్డును మంగళవారం నుంచి కొనసాగిస్తామని చెప్పారు. 

error: Content is protected !!