News April 14, 2024

కొత్తపేట.. కోరుకునేదెవరిని?

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యే కొత్త పోరు జరగనుంది. చిర్ల జగ్గిరెడ్డి(YCP) హ్యాట్రిక్‌పై ధీమాతో ఉండగా, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, టీడీపీ హామీలు కలిసొస్తాయని బండారు సత్యానందరావు భావిస్తున్నారు. 7సార్లు INC, 4సార్లు TDP, 2సార్లు YCP, జనతాపార్టీ, PRP చెరోసారి గెలిచాయి. ఇక్కడ 1999 తర్వాత టీడీపీ గెలవకపోవడం గమనార్హం.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 7, 2026

టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

image

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.

News March 7, 2026

కర్ణాటక HCలో శ్రీలంక SC జడ్జి పిటిషన్.. ఎందుకంటే?

image

ఆన్‌లైన్ కంటెంట్ కారణంగా తన పరువుకు భంగం కలుగుతోందని శ్రీలంక SC జడ్జి జస్టిస్ నవాజ్ కర్ణాటక HCలో పిటిషన్ వేశారు. వాటి ఆధారంగా SL మీడియా వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోందని, ఆ కంటెంట్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రం, గూగుల్ INDను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీలంక SC జడ్జి తమ దేశంలో పరువునష్టం దావా వేయడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. గూగుల్ IND HQ బెంగళూరులో ఉండటంతో పిటిషన్ వేశారు.

News March 7, 2026

నేపాల్‌లో ఛేంజ్.. భారత్‌కు కలిసొస్తుందా?

image

నేపాల్‌‌లో ఎన్నికల్లో బాలెన్ షా ఆధ్వర్యంలోని ప్రజా స్వతంత్ర పార్టీ గెలుపుదిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో నేపాల్ బంధం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. PM అభ్యర్థి అయిన షా జాతీయవాది. గతంలో భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. కానీ గత పాలకుల తరహాలో చైనాకు ఫేవర్ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే విషయం. బ్యాలెన్స్డ్ ఫారిన్ రిలేషన్స్ కోరుకుంటున్నానని షా మ్యానిఫెస్టోలో చెప్పారు.