News March 3, 2025
KPHBలో నేపాల్ వాసి ఆత్మహత్య..

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. KPHB 4వ ఫేజ్లోని LIG 213/2లో నివాసముండే ప్రేమ రావల్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని నేపాల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బతుకుదెరువు కోసం KPHBలో నివాసం ఉంటూ హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Similar News
News November 28, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.
News November 28, 2025
జగిత్యాల: ‘రూ.50వేల లోపు నగదుకే అనుమతి’

ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాల రవాణాను అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 3 ఎస్ఎస్టీ, 20 ఎఫ్ఎస్టీ టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నియమాల ప్రకారం 50 వేల రూపాయలలోపు నగదు మాత్రమే అనుమతించబడుతుందని, అంతకంటే ఎక్కువైతే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
News November 28, 2025
NRPT: ‘ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి’

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08506-283122కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రాజకీయ నాయకులు, అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళి పాటించాలని ఆమె స్పష్టం చేశారు.


