News October 12, 2025

KPHBలో వ్యభిచారం.. అరెస్ట్

image

KPHB రోడ్డు పక్కన వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు దీలీప్ సింగ్‌ (46)ను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంపై పోలీసులు దాడి చేసి, అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని KPHB పోలీసులు తెలిపారు.

Similar News

News October 12, 2025

ధర్మపురి: చాగంటి ప్రవచనలు.. భక్తులు మంత్రముగ్ధం

image

ధర్మపురి బ్రాహ్మణ సంఘం శ్రీవారి మఠం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భక్తులకు రెండో రోజు ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అడ్లూరి కుమారుడు హరీశ్వర్ రూపొందించిన లక్ష్మీనరసింహస్వామి లఘుచిత్రం ప్రోమో ఆవిష్కరించారు.

News October 12, 2025

మెదక్: సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ప్రజలు సైబర్ నేరాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. లోన్ యాప్‌లు, జాబ్ ఫ్రాడ్‌లు, ఏపీకే ఫైల్స్‌తో డాటా చోరీ, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఎస్పీ కోరారు.

News October 12, 2025

గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తివేస్తాం: జన్ సురాజ్

image

త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే లిక్కర్ బ్యాన్ వెంటనే ఎత్తివేస్తామని జన్ సురాజ్ పార్టీ ప్రకటించింది. దీంతో రూ.28వేల కోట్ల రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రపంచ బ్యాంకు, IMF నుంచి రూ.5-6లక్షల కోట్ల రుణాల సమీకరణకు ఉపయోగిస్తామని వెల్లడించారు. బిహార్‌లో 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది.