News October 29, 2025
KPHBలో RAIDS.. మహిళలు, యువతులు అరెస్ట్

కూకట్‌పల్లిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ACP రవికిరణ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు KPHB మెట్రో స్టేషన్, పుల్లారెడ్డి స్వీట్ షాప్, మెట్రో పరిసర ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. యువకులు, వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న 11 మంది మహిళలు, యువతులను అదుపులోకి తీసుకొన్నారు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. ఆరుగురికి 7 రోజుల రిమాండ్ విధించారు.
Similar News
News October 29, 2025
ఖైరతాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి BRS ఫిర్యాదు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ.సుదర్శన్ రెడ్డిని బుధవారం బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, హామీలు గుమ్మరించి ఓట్లు దండుకునేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిసి ECకి ఫిర్యాదు చేశారు.
News October 29, 2025
ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవ వేడుకల నేపథ్యంలో ఐక్యత పాదయాత్ర (యూనిటీ మార్చ్) చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఐక్యత పాదయాత్ర నిర్వహణ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పటేల్ జయంతి ఉత్సవాల వేడుకలను చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News October 29, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీనే ప్రత్యామ్నాయం: కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌కి మద్దతుగా షేక్‌పేట్ డివిజన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలపై మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకుండా ప్రజలను మోసం చేశాయని ఓటర్లకు వివరించారు.


