News April 2, 2025
KPHB: భర్త టార్చర్ భరించలేక భార్య సూసైడ్!

కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలోనీ 3వ ఫేజ్లో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు(29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో 3 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 13, 2025
అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.
News December 13, 2025
చిన్నకాపర్తిలో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదు: కలెక్టర్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డ్రైనేజీలో ఓట్లు దొరికిన ఘటనపై ఎలాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లు బయటపడగానే ఆర్డీఓ అశోక్ రెడ్డిని పంపి విచారణ జరిపించామన్నారు. పోలైన ఓట్లు, కౌంటింగ్లో లెక్కించిన ఓట్లు, డ్రైనేజీలో దొరికిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయని కలెక్టర్ తెలిపారు.
News December 13, 2025
జగిత్యాల: 853 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 1276 పోలింగ్ కేంద్రాలలో 134 సర్పంచ్, 946 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్నికల విధుల్లో 853 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ సామగ్రిని పటిష్ట ఎస్కార్ట్తో తరలిస్తూ 57 రూట్లలో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.


