News September 12, 2025

KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

image

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

Similar News

News September 12, 2025

ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

image

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.

News September 12, 2025

KMM: టీజీఎస్‌ఆర్టీసీ ‘యాత్రాదానం’ కార్యక్రమం ప్రారంభం

image

టీజీఎస్‌ఆర్టీసీ తమ సామాజిక బాధ్యతలో భాగంగా “యాత్రాదానం” సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభ సందర్భాలలో ప్రజలు, సంస్థలు ఇచ్చే విరాళాలతో అనాథలు, నిరాశ్రయులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రలకు పంపుతామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు హెల్ప్‌లైన్ నెంబర్ 040-69440000ను సంప్రదించాలన్నారు.

News September 12, 2025

రాష్ట్రంలో మరోసారి కుల గణన: సిద్దరామయ్య

image

కర్ణాటకలో మరోసారి కుల గణన చేయాల్సిన అవసరం ఉందని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ‘సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా మరోసారి సర్వే నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ గణన జరుగుతుంది. 2015లో నిర్వహించిన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఆమోదించలేదు. పదేళ్లు గడిచిపోయాయి. తాజాగా మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన సామాజిక న్యాయం దక్కాలి’ అని తెలిపారు.