News May 21, 2024

KPHB పీఎస్ పరిధిలో వివాహిత ఆత్మహత్య

image

మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మాధురి(32) అనే వివాహితకు 14 ఏళ్ల క్రితం శివార్పన్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఏడాది క్రితం నుంచి రోడ్డు నెం.3లోని EWSలో ఉంటూ బ్యూటిషన్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే విశ్వనాథరెడ్డి చెప్పకుండా హాస్టల్ ఖాలీచేసి వెళ్లడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News November 4, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

image

HYD బుద్ధభవన్‌లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. మల్లాపూర్,సాయినగర్, ఎంఎర్‌టౌన్‌షిప్, మణికొండ, గుట్టలబేగంపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడాలని కోరారని, చర్యలు తీసుకుంటామన్నారు.

News November 4, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీశ్‌రావు మీటింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి నడుమ సిద్దిపేట BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రహమత్‌నగర్ డివిజన్‌పై వ్యూహరచన కోసం హరీశ్‌రావు నివాసంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో నేతలు, ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉపఎన్నిక ఫలితంపై నిర్ణాయకంగా ప్రభావం చూపే డివిజన్‌లలో మరింత బలోపేతం, బూత్‌ల వారీ సమన్వయం చేసుకోవాలన్నారు.

News November 4, 2025

HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

image

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్‌బాబు ఈరోజు HYD నేరెడ్‌మెట్‌లోని CP ఆఫీస్‌లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్‌కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్‌రావు, CI సెల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.