News January 28, 2025
KPHB: 9999 నంబర్ ప్లేట్‌కు భారీ ధర

KPHB 4వ ఫేజ్‌లోని కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో 9999 నంబర్‌కు ఈ సారి భారీ ధర పలికింది. ఈ వేలం పాటలో 9999 నంబర్ ప్లేట్‌ను ఓ ప్రముఖ వ్యాపార సంస్థ రూ.9,99,999కు ఆన్లైన్ వేలం పాట ద్వారా దక్కించుకున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీను బాబు తెలిపారు.
Similar News
News December 23, 2025
మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
News December 23, 2025
ఢిల్లీకి చేరువలో HYD పొల్యూషన్

HYDలో ఎయిర్ క్వాలిటీ ఢిల్లో పరిస్థితి దగ్గరలో ఉంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 300 ఉండగా.. నగరంలో డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 270కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం మేలని, చిన్న పిల్లలను దీని నుంచి కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News December 23, 2025
మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. అర్చకులు, వేద పండితులు అమ్మవారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో అభిషేకించారు. మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.


