News January 28, 2025

KPHB: 9999 నంబర్‌ ప్లేట్‌కు భారీ ధర 

image

KPHB 4వ ఫేజ్‌లోని కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో 9999 నంబర్‌కు ఈ సారి భారీ ధర పలికింది. ఈ వేలం పాటలో 9999 నంబర్ ప్లేట్‌ను ఓ ప్రముఖ వ్యాపార సంస్థ రూ.9,99,999కు ఆన్‌లైన్‌ వేలం పాట ద్వారా దక్కించుకున్నట్లు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీను బాబు తెలిపారు.

Similar News

News February 15, 2025

ఎంతో చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె సహకరించట్లేదు: సీఎం

image

AP: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు.

News February 15, 2025

చిరంజీవి లుక్ అదిరిందిగా!

image

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఓ ఫొటో పంచుకోగా వైరలవుతోంది. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిరును షూటింగ్ సెట్స్‌లో కలవగా.. మరో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. నుదిటిపై బొట్టుతో ఇంద్రసేనా రెడ్డిలా కనిపించారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News February 15, 2025

ఆ ముగ్గురికి ఛాంపియన్స్ ట్రోఫీనే లాస్ట్: చోప్రా

image

రోహిత్, విరాట్, జడేజాకు ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ICC ఈవెంట్ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. బరువెక్కిన హృదయంతో తాను ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. తరచూ వస్తున్న రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో వీరు 2027 వన్డే WC వరకు కొనసాగకపోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది టీ20 WC ఉన్నా రోహిత్, కోహ్లీ, జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని చోప్రా గుర్తు చేశారు.

error: Content is protected !!