News January 28, 2025

KPHB: 9999 నంబర్‌ ప్లేట్‌కు భారీ ధర

image

KPHB 4వ ఫేజ్‌లోని కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో 9999 నంబర్‌కు ఈ సారి భారీ ధర పలికింది. ఈ వేలం పాటలో 9999 నంబర్ ప్లేట్‌ను ఓ ప్రముఖ వ్యాపార సంస్థ రూ.9,99,999కు ఆన్‌లైన్‌ వేలం పాట ద్వారా దక్కించుకున్నట్లు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీను బాబు తెలిపారు.

Similar News

News March 15, 2025

HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

image

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

News March 14, 2025

HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

image

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.

News March 14, 2025

హోలీ సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

image

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఈ నెల 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని దివ్య సూచించారు.

error: Content is protected !!