News November 5, 2025

KPHB: OYOలో పోలీసుల RAIDS

image

KPHBకాలనీలోని హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా రోడ్ నం.3లోని OYO హోటల్‌లో రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్ (27), రమేశ్ (28)గా గుర్తించారు. APలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. OYOలో రూమ్‌ అద్దెకు తీసుకొని మరీ వ్యాపారం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Similar News

News March 26, 2026

కరెంట్ ఛార్జీలపై GOOD NEWS

image

AP: FY27లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, ప్రజలపై ట్రూఅప్ భారమూ వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కమ్‌లకు ₹15,790Cr రెవెన్యూ లోటును తామే భరిస్తామని APERCకి లేఖ రాసింది. దీనివల్ల 1.30Cr గృహ విద్యుత్ వినియోగదారులకు మేలు జరగనుంది. 22L మంది రైతులకు, 22 లక్షల SC, ST, ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత/రాయితీ విద్యుత్ కొనసాగనుంది. 2L మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95కు తగ్గనుంది.

News March 26, 2026

బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం

image

AP: మార్కాపురం జిల్లాలో ఘోర <<19478496>>బస్సు ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.

News March 26, 2026

మెదక్: ఉదయం రెక్కి.. మధ్యాహ్నం దొంగతనం

image

చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో బుధవారం <<19473618>>పట్టపగలే<<>> వృద్ధ దంపతులు సాలే సావిత్రి, అంజయ్యపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. గ్యాస్ పోయ్యిలు బాగుచేస్తామంటూ ఉదయం రెక్కి నిర్వహించిన దుండగులు.. సావిత్రి ఇంట్లోవారంతా శుభకార్యానికి వెళ్లడంతో ఇదే అదనుగా ఇంట్లో చొరబడి వారిపై దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.