News February 21, 2025
KPHBలో యువకుడి మిస్సింగ్

ఇన్‌స్టాలో పరిచయమైన మహిళతో యువకుడు వెళ్లి పోయిన ఘటన KPHB PS పరిధిలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పవన్ అనే యువకుడు ఈనెల 6వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని పుణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా మహిళా ఫోన్ ఎత్తి ‘మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తా’అని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 22, 2025
యాక్సిడెంట్లో మేడిపల్లి MRO ఆఫీస్ ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో మేడిపల్లి తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగి మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సందీప్(33) మేడిపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతిచెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 22, 2025
ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్లో పాల్గొంటామన్నారు.
News February 22, 2025
కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.