News March 17, 2024

కృష్ణా: జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్ష

image

జిల్లాలో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 స్క్రీనింగ్ ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ‌లో 24 కేంద్రాల్లో 10,526 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉద‌యం జ‌రిగిన పేప‌ర్‌-1కు 63.06 శాతం (6,638), మ‌ధ్యాహ్నం జ‌రిగిన పేప‌ర్‌-2కు 62.66 శాతం (6,596) మంది హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు.

Similar News

News September 3, 2025

పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

image

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్‌ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.

News September 2, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ చల్లపల్లిలో చోరీలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
☞ స్వమిత్వ సర్వేతో భూ సమస్యల పరిష్కారం: కలెక్టర్
☞ NTR: 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ ఉంగుటూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు
☞ హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్
☞ హనుమాన్ జంక్షన్‌లో ఆటో డ్రైవర్ల ఆందోళన

News September 2, 2025

హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్

image

హరికృష్ణ జయంతి సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. ‘నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ’ అని రాసుకొచ్చారు. గతంలో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.