News March 18, 2024

కృష్ణా: బీఈడీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్‌ థియరీ పరీక్షల 2020, 2021, 2022బ్యాచ్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 25నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News January 27, 2026

కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ డీకే బాలాజీ సమీక్షించారు. నిర్మాణాల వేగవంతానికి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 121 గృహాలు మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గృహాలలో 719 గృహాలు BBL దశలో, 2770 గృహాలు BL దశలో, 119 గృహాలు RC దశలో ఉన్నాయన్నారు.

News January 27, 2026

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.

News January 27, 2026

మాతృ మరణాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో వైద్యాధికారులతో సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించిన రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, వారి మరణానికి గల కారణాలను వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు.