News September 8, 2024

కృష్ణా నదికి మళ్లీ వరద.. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత

image

AP: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ప్రవాహం మళ్లీ పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Similar News

News February 20, 2026

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈ రోజు

image

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం (ఫొటోలో)
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

News February 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 20, 2026

‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లే లక్ష్యం: మంత్రి

image

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగానే Ex IAS రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించినట్లు చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. CM CBN బీసీల పక్షపాతి అని తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లను 24%కే పరిమితం చేసిందని విమర్శించారు.