News December 9, 2024
బీజేపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య

మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.
Similar News
News October 14, 2025
L.C.A-643 మిరప రకం ప్రత్యేకతలు ఇవే

పచ్చిమిర్చితో పాటు ఎండు మిర్చికి కూడా అనువైన రకం L.C.A-643. ఈ మిర్చి కాయలు లేత ఆకుపచ్చరంగులో పొడవుగా 13 నుంచి 14 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కాయలు ఎండిన తర్వాత కూడా కాస్త ముడతపడి ఆకర్షణీయమైన రంగులో ఉంటాయి. ఇది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. జెమిని వైరస్ను కూడా కొంత వరకు తట్టుకుంటుంది. నల్లతామర పురుగు సోకినా కొద్దిపాటి పురుగు మందులను పిచికారీ చేస్తే దీన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది.
News October 14, 2025
APPLY NOW: SBIలో 10 పోస్టులు

SBI 10 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/FRM/CA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in/
News October 14, 2025
చలిగాలి చూడు.. గిలిగింత పెడుతున్నది!!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ఎండింగ్కు చేరిందో లేదో వింటర్ ఎంటరైంది. కొద్ది రోజులుగా ఉభయ రాష్ట్రాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కొన్నిచోట్ల టెంపరేచర్ సగటున 18-16కు పడిపోతోంది. దీంతో తెల్లవారుజామున పనులకు వెళ్లాల్సిన వారు, కసరత్తులతో కాస్త ఒళ్లు కరిగిద్దాం అనుకున్న వారు అలారాన్ని ఓసారి స్నూజ్ చేసి కానీ లేవడం లేదు. బయటకు వచ్చాక కూడా చల్లగాలులతో మెల్లగా వణుకు మొదలైంది. మీకూ…?