News July 16, 2024
వారంలోగా శ్రీశైలంలోకి కృష్ణమ్మ పరుగులు
వారంలోగా శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగులు తీయనుంది. కర్ణాటకలో భారీ వర్షాలతో వరద ఉద్ధృతి పెరగడంతో ఎగువన ఆల్మట్టి డ్యామ్ మరో 2 రోజుల్లో నిండనుంది. ఆ తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్, జూరాల ప్రాజెక్టులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే నిండనున్నాయి. దీంతో దిగువన ఉన్న శ్రీశైలానికి నీళ్లను విడుదల చేయనున్నారు. మరోవైపు తుంగభద్ర బేసిన్లోనూ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అవి కూడా శ్రీశైలం చేరనున్నాయి.
Similar News
News February 2, 2025
రహస్య భేటీ వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యేలు
TG: కాంగ్రెస్ MLAలు రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలపై MLAలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాము ఈ భేటీలో పాల్గొనలేదని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి, ఆలేరు MLA బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని రాజేందర్ రెడ్డి CM రేవంత్కు లేఖ రాశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. సీఎంను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానన్నారు.
News February 2, 2025
కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది: భట్టి విక్రమార్క
TG: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి నిరాశ చెందినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. ‘నీటి పారుదల ప్రాజెక్టులు, వరంగల్ విమానాశ్రయం, AI కార్యక్రమాలకు నిధులను కేటాయించకుండా తెలంగాణ అవసరాలను ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేసింది. పెరిగిన CSS బదిలీలు, తగ్గిన రాష్ట్ర వాటాలతో ఫిస్కల్ ఫెడరలిజం దెబ్బతింటుంది. తెలంగాణ ఎదుగుదల ఆకాంక్షలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది’ అని పేర్కొన్నారు.
News February 2, 2025
KG చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా మారాయి. హైదరాబాద్ నగరంలో స్కిన్ లెస్ కేజీ రేటు రూ.240, విత్ స్కిన్ రూ.220గా ఉంది. అటు ఏపీలోని కాకినాడలో స్కిన్ లెస్ రూ.180 పలుకుతోంది. గత వారం ఇక్కడ ధర రూ.220 ఉండగా, ఇప్పుడు రూ.40 తగ్గింది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.