News April 14, 2024

IMF ఎండీగా మరోసారి క్రిస్టాలినా

image

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి క్రిస్టాలినా జార్జివా ఎన్నికయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ఐదేళ్ల పాటు ఎండీగా రెండో టర్మ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నాయకత్వంలో ఎన్నో ఒడుదొడుకులను దీటుగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ బోర్డు క్రిస్టాలినాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా మరోసారి IMF MD బాధ్యతలు అందుకోవడంపై క్రిస్టాలినా హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News March 20, 2026

IPL: ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్.. నెట్టింట ట్రోల్స్

image

IPL కీలక ప్లేయర్లు గాయాలబారిన పడి లీగ్‌కు దూరం అవుతున్నారు. దీంతో IPLను ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఎల్లిస్(CSK), సామ్ కరన్(RR), హర్షిత్(KKR), మిల్నే(RR), జాక్ ఎడ్వర్డ్స్(SRH), హసరంగా(LSG) ఇప్పటికే లీగ్ నుంచి వైదొలిగారు. ఇక హేజిల్ వుడ్(RCB), కమిన్స్(SRH) గాయాలతో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఈనెల 28న లీగ్ ప్రారంభమయ్యేలోపు ఇంకెంత మంది ఇలా గాయాలబారిన పడతారో?

News March 20, 2026

చలాన్ కట్టకపోతే లైసెన్స్, RC ఫ్రీజ్!

image

TG: సకాలంలో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, RC ఫ్రీజ్ చేసే దిశగా ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే చర్యలు చేపడతారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.

News March 20, 2026

అజహరుద్దీన్‌ మంత్రి పదవికి డెడ్‌లైన్ గండం!

image

TG: మంత్రిగా కొనసాగుతున్న అజహరుద్దీన్‌కు ఏప్రిల్ ఆఖరుతో 6 నెలల గడువు ముగియనుంది. ప్రభుత్వం పంపిన MLC సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధం నెలకొంది. నిబంధనల ప్రకారం ఆలోగా సభ్యత్వం పొందకుంటే రాజీనామా తప్పదు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపైనే ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడో చూడాలి.