News July 16, 2024
AP, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసిన KRMB
ఏపీ, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. APకి 4.500 TMCలు, TGకి 5.414 TMCల నీటిని శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బోర్డు స్పష్టం చేసింది.
Similar News
News January 23, 2025
TODAY HEADLINES
* బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
* బందరు పోర్టుతో తెలంగాణ డ్రైపోర్టు లింకప్: సీఎం రేవంత్
* తెలంగాణలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడులు
* గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఏపీ: నారా లోకేశ్
* మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
* డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
* భారీగా పెరిగిన బంగారం ధరలు
* కుంభమేళా ‘మోనాలిసా’కు సినిమా ఆఫర్
* ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా ఘనవిజయం
News January 23, 2025
దొడ్డు బియ్యం అమ్ముకునేవారు.. మేం సన్నబియ్యం ఇస్తాం: మంత్రి
TG: గతంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, తాము ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యానికి ఏటా రూ.7వేల కోట్లు ఖర్చు చేసేదని, అయినా ఆ దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినకపోయేవారని చెప్పారు. వాటిని లబ్ధిదారులు బయట అమ్ముకునేవారని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.
News January 23, 2025
నా ఎదుగుదలకు వారే కారణం: అభిషేక్ శర్మ
క్రికెటర్‌గా తన ఎదుగుదలకు యువరాజ్ సింగ్, లారా, వెటోరి తోడ్పడ్డారని, ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండగా నిలుస్తున్నారని అభిషేక్ శర్మ తెలిపారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విఫలం అవుతాననే భయం లేకుండా సొంత శైలిలో ఆడమని కోచ్, కెప్టెన్ తనకు చెప్పారని పేర్కొన్నారు. అదే తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నారు. తొలి టీ20లో అభిషేక్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.