News January 21, 2025

ముగిసిన KRMB సమావేశం

image

TG: హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Similar News

News January 5, 2026

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: పార్థసారథి

image

AP: రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. సోలార్, విండ్, బయో విద్యుత్ రంగాల్లో 80గిగావాట్ల విద్యుత్‌ను తక్కువ ధరకు కొనే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు కంప్లీట్ సబ్సిడీ.. బీసీలకు అదనంగా రూ.50వేల రాయితీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.

News January 5, 2026

శివ మానస పూజ ఎలా చేయాలి?

image

శివ మానస పూజ అంటే ఏ పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుడిని ఆరాధించడం. అందుకోసం ప్రశాంతమైన చోట కూర్చుని కళ్లు మూసుకోవాలి. హృదయమే రత్న సింహాసనమని, ఆత్మయే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలంతో అభిషేకం, కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివుడికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తిమంతమైనది. భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజను ఆచరించవచ్చు.

News January 5, 2026

కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం ఎక్కువే..

image

కాండం తొలిచే పురుగు వరి నారుమడి నుంచి పంట ఈనె దశ వరకు ఆశించి నష్టం కలిగిస్తుంది. నారుమడి దశలో ఈ పురుగు మొక్క మువ్వలోకి రంద్రాలు చేసుకొని చొచ్చుకెళ్లి తినడం వల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి మెలికలు తిరిగి ఎండి, మొక్కలు అధికంగా చనిపోతాయి. కాండం భాగాన్ని ఈ పురుగు తింటే మొక్కకు సరిపడ పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి. కాండం తొలుచు పురుగు పంట నాణ్యత, దిగుబడిని ప్రభావితం చేస్తుంది.