News February 26, 2025
ముగిసిన KRMB సమావేశం

TG: హైదరాబాద్ జలసౌధలో ఇవాళ కొనసాగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తమకు మే నెల వరకు 55 టీఎంసీల నీరు కావాలని ఏపీ, 63 టీఎంసీలు కావాలని తెలంగాణ బోర్డుకు తెలిపాయి. ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ సమావేశమయ్యారు.
Similar News
News February 26, 2025
ZADRAN: ఇది కదా హీరోయిజం అంటే..!

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (177) భారీ సెంచరీతో చెలరేగారు. కాగా జద్రాన్ గాయం కారణంగా 6 నెలలు క్రికెట్‌కు దూరమయ్యారు. గతేడాది చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత రికవరీ అయిన జద్రాన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్నారు. ఏకంగా అఫ్గాన్ తరఫున అత్యధిక స్కోరు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కారు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.
News February 26, 2025
BIG BREAKING: పోసాని కృష్ణమురళి అరెస్ట్

TG: వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు HYD రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
News February 26, 2025
రేపు స్కూళ్లకు సెలవు

APలో MLC ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉండనుంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం టీచర్స్ MLC ఎన్నిక నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని DEOలు ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మీకు రేపు సెలవు ఇచ్చారా? తెలంగాణలోనూ <<15581975>>సెలవు <<>>ఇచ్చారు.