News June 20, 2024

KRU: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో బీటెక్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ విడుదల అయింది. జూలై 2, 4, 6, 8,10 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News September 9, 2024

విజయవాడ: వరద బాధితులకు రూ.కోటి విరాళం

image

లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని సోమవారం అందజేశారు. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్‌లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు అభినందించి, వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.

News September 9, 2024

విజయవాడ: వరద విపత్తు వేళ దొంగల చేతివాటం

image

వరద బాధిత ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇటీవల నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మొబైల్స్ షాపు, మద్యం దుకాణంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. నీళ్లలో మునిగిన బైక్‌లలో పెట్రోల్, టైర్లు చోరీ అయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలో మునిగిన బైక్‌లను ఆగంతుకులు తుక్కు కింద అమ్మేస్తున్నారని ముంపు ప్రాంతాల వారు చెబుతున్నారు.

News September 8, 2024

కృష్ణా జిల్లాలో పలు రైళ్ల రద్దు

image

నిర్వహణ కారణాల రీత్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రయాణించే కింది రైళ్లను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేశామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం తెలిపింది. రాజమండ్రి- విజయవాడ (07460), విజయవాడ- మచిలీపట్నం (07895) , మచిలీపట్నం- విజయవాడ (07896), విజయవాడ- మచిలీపట్నం (07769), మచిలీపట్నం- గుడివాడ (07872), గుడివాడ- మచిలీపట్నం (07871), మచిలీపట్నం- విజయవాడ (07899).