News August 19, 2024

క్షత్రియులకు చట్టసభల్లో ప్రాధాన్యం ఇస్తాం: సీఎం రేవంత్

image

TG: చట్టసభల్లో క్షత్రియులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ క్షత్రియ సేవా సమితి సభలో హామీ ఇచ్చారు. ‘రాజకీయాల్లో రాణించాలన్న ఉత్సాహంతో ఉన్నవారిని క్షత్రియ వర్గం గుర్తించి ప్రోత్సహించాలి. వారికి పార్టీలో పదవులు, మున్ముందు టికెట్లు కేటాయిస్తాం. అటువంటి వారి జాబితాను క్షత్రియ వర్గ ప్రతినిధులు ఇస్తే ఆయా నేతలను నాయకులుగా తయారుచేస్తాం. తగిన అవకాశాలు కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2026

శుక్రుని ఆరాధనతో కళత్ర దోషం దూరం

image

పురుష జాతకంలో శుక్రుడు వివాహ కారకుడు. శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా, పాప గ్రహాలతో కలిసినా కళత్ర దోషం ఏర్పడి పెళ్లి ఆలస్యమవుతుంది. ఈ దోషం పోవడానికి శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించాలి. తెల్లటి వస్త్రాలు ధరించడం, మొలకలు వచ్చిన బొబ్బర్లను దానం చేయడం శుభప్రదం. లలితా సహస్రనామ పారాయణ చేస్తే శుక్ర గ్రహ దోషాలు తొలగి, వైవాహిక జీవితం సుఖమయం అవుతుంది. పరులకు సహాయం చేస్తే శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు.

News March 20, 2026

హెడ్ ఇంజూరీ.. ‘గోల్డెన్ అవర్’ కీలకం

image

తలకు తీవ్ర గాయమైనప్పుడు తొలి 60 నిమిషాలు అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు. దీన్నే ‘గోల్డెన్ అవర్’ అంటారు. ‘ఈ గంటలో ప్రతి నిమిషంతో పోటీ పడి బాధితులను ఆసుపత్రికి తరలించాలి. ప్రధానంగా బ్లీడింగ్‌ అదుపు చేయాల్సి ఉంటుంది. పేషంట్‌ను తరలించే సమయంలోనూ మెడ కదలకుండా చూసుకోవాలి. గంటలోపు చికిత్స అందిస్తే సాధ్యమైనంతవరకు ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు’ అని తెలిపారు.
* ఇవాళ వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్‌నెస్ డే

News March 20, 2026

తొలిసారి రూ.93కు చేరిన రూపీ విలువ

image

ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇవాళ మరింత క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. 92.92 వద్ద ఉన్న రూపీ విలువ ఎర్లీ ట్రేడ్‌‌లో పడిపోయి 93కు చేరింది.