News May 4, 2024
KTDM:ఇద్దరు గిరిజనులను హతమార్చిన మావోయిస్టులు

చర్ల సరిహద్దు బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి వడిగట్టారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మడవి ఉంగ, మడవి జోగా అనే ఇద్దరు గిరిజన సోదరులను శనివారం హతమార్చారు. టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుత్వాయి గ్రామానికి చెందిన ఆ ఇద్దరిని సమీప అటవీ ప్రాంతంలోకి పిలిచి ప్రజాకోర్టు నిర్వహించి సోదరులకు మరణశిక్ష విధించారు. దీన్ని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ధ్రువీకరించారు.
Similar News
News December 17, 2025
ముగిసిన ‘పంచాయతీ’ సమరం.. ఫలితంపై ఉత్కంఠ

ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసింది. అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం మద్యం, మాంసం, బాండ్ పేపర్లతో హామీలిచ్చారు. హోరాహోరీ ప్రచారం తర్వాత పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసిన అభ్యర్థుల్లో గెలుపుపై గుబులు మొదలైంది. మరికొద్ది గంటల్లో గ్రామరథ సారధులు ఎవరో తేలిపోనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News December 17, 2025
ఖమ్మం: ముగిసిన మూడో విడత.. 86.65% ఓటింగ్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు.
News December 17, 2025
ఖమ్మం: వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

ఖమ్మం జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ నిశితంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని పోలింగ్ సరళిని వీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటింగ్ విధానంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.


