News March 23, 2024
KTDM:ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో తుపాకుల మోత మోగింది. పెడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి జవాన్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు గాలిస్తున్నారు.
Similar News
News April 20, 2025
నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News April 20, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

:- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ 10వ తరగతి పరీక్షలు:-ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు :-సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన :-వేంసూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన :-ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News April 20, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్ల (బ్యాక్లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.