News August 22, 2024
KTDM:అత్తవారింటికి వచ్చి అల్లుడు సూసైడ్

మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చిన అల్లుడు మద్యం మత్తులో కలుపు మందు తాగిన విషయం తెలిసిందే. ఖమ్మంకు చెందిన ఓంకార్ కు మణుగూరుకు చెందిన యువతితో ఏడాది కిందట వివాహమైంది. రాఖీపౌర్ణమికి అత్తగారి ఇంటికి వచ్చిన ఓంకార్ మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై మేడాప్రసాద్ కేసు నమోదు చేశారు.
Similar News
News July 6, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6.8 మి.మీ వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. రఘునాథపాలెం మండలంలో 1.0, ఏన్కూరు మండలంలో 5.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. ఈ రెండు మండలాలు మినహా గడిచిన 24 గంటల్లో ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News July 6, 2025
ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.
News July 6, 2025
ఖమ్మం శ్రీలక్ష్మీ రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు

ఖమ్మం రంగనాయకుల గుట్టపై స్వయంభు కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు బూరుగడ్డ శ్రీధరాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం, సువర్ణపుష్పార్చన, ఉదయం 9:30కు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని, భక్తులు సకాలంలో హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.