News May 11, 2024

KTDM: ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లా గంగలోర్ పీఎస్ పరిధిలోని పీడీయా  అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే మరింత అవకాశం ఉందని తెలిసింది. అలాగే మృతి చెందిన వారిలో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 22, 2026

ఖమ్మం: ‘మాకు స్తోమత లేదు.. అక్కడే పూడ్చండి’

image

పొట్టకూటి కోసం వేలాది మైళ్ల దూరం నుంచి వచ్చిన ఆ వలస కూలీకి చివరకు సొంతూరి మట్టి కూడా కరవైంది. బిహార్‌కు చెందిన రాజన్‌రామ్‌ పందిళ్లపల్లి సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అంత దూరం వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లే స్తోమత తమకు లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. దీంతోఅన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

News January 22, 2026

రైతులకు ఊరట.. జిల్లాకు భారీగా యూరియా

image

సాగువేళ రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బుధవారం చింతకాని పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు 505.35మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఈ నిల్వలను పూర్తిగా ఖమ్మం జిల్లాకే కేటాయించినట్లు ఏఓ (టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.

News January 22, 2026

ఖమ్మం: ఎన్నికల నగారా.. మున్సిపాలిటీలపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్!

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లిలలో ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల తనిఖీ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.