News January 30, 2025
KTDM: ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొదలైన కోలాహలం

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవడంతో కోలాహలం మొదలైంది. కాగా ఇటీవలే ఈ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తైంది. కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల పరిధిలో 23 పోలింగ్ బూత్ల పరిధిలో 1,949 మంది ఓటర్లుగా తేలారు. ఇందులో పురుషులు 1,038 మహిళలు 941 మంది ఉన్నారు. ఈ నెల 31 వరకు ఓటు నమోదుకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News December 19, 2025
యూట్యూబర్పై ED దాడులు.. లగ్జరీ కార్లు సీజ్

ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో UPలోని ఉన్నావో జిల్లాకు చెందిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంటిపై ED దాడులు చేసింది. లంబోర్గిని URUS, BMW Z4, బెంజ్ సహా పలు లగ్జరీ వెహికల్స్ను అధికారులు సీజ్ చేశారు. స్కై ఎక్స్ఛేంజ్ సహా పలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ద్వివేదికి భారీగా ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. అనురాగ్ యూట్యూబ్ ఛానల్కు 7.11 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
News December 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 19, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.04 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 19, 2025
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారక రామారావు శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను ఆయన సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.


