News May 22, 2024
KTDM: కారు డోరు లాక్.. ఊపిరాడక చిన్నారి మృతి

కారులో ఆడుకుంటూ చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కొండయిగూడెంకి చెందిన చిన్నారి కల్నిషా (3) ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది.డోర్ ఆటోమేటిక్గా లాక్ అయి ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Similar News
News December 12, 2025
ప్రభుత్వ ఫార్మా బలోపేతానికి చర్యలేంటి?: ఎంపీ

దేశంలో ఫార్మా పీఎస్యూ (పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుత పీఎస్యూల ఆధునికీకరణ ప్రణాళికలేంటో లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దీనికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 12, 2025
విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక: అదనపు కలెక్టర్

విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భారీ వరదల సమయంలో నీటి విడుదల కోసం పైనున్న ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలని సూచించారు.
News December 12, 2025
బోనకల్ సర్పంచ్గా భార్య, వార్డు సభ్యుడిగా భర్త విజయం

బోనకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ జ్యోతి సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి భూక్య మంగమ్మపై 962 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ విజయం కంటే ఆసక్తికరంగా, జ్యోతి భర్త బాణోత్ కొండ 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఈ అపూర్వ విజయంతో గ్రామంలో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.


