News June 2, 2024

KTDM: కుల బహిష్కరణ నెపంతో దాడి

image

కుల బహిష్కరణ నెపంతో తమపై గ్రామస్థులు దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం చాపరాలపల్లికి చెందిన గద్దల రాజు రెండు నెలల క్రితం బొడ్రాయి ప్రతిష్ఠకు చందా ఇవ్వలేదు. దీంతో కుల బహిష్కరణ చేశారు. శనివారం తన సమీప బంధువు చనిపోగా వెళ్లిన క్రమంలో గ్రామస్థులు చేశారని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 19, 2024

బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

బూర్గంపహాడ్‌లోని ఆసుపత్రిని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వార్డులు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వివరాలు, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన టాయిలెట్లు డిజైన్ పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ ముజాహిద్, ఆస్పత్రి సూపర్డెంట్ ముక్తేశ్వరరావు ఉన్నారు.

News September 18, 2024

కొత్తగూడెం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి

image

కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1 లక్షా 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై కోసం లంచం తీసుకుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వెల్లడించారు.

News September 18, 2024

19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.