News June 11, 2024
KTDM: క్యాన్సర్తో 15 నెలల చిన్నారి మృతి

గార్లలో విషాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ బజార్కు చెందిన 15 నెలల చిన్నారి షబానా క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. పుట్టిన కొద్దిరోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాప మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News January 6, 2026
యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 12,682 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 25,773 టన్నుల ఎరువులను పంపిణీ చేశామని వివరించారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు నీడ, తాగునీటి వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
News January 6, 2026
ఖమ్మం జిల్లాకు 72 వసంతాలు.. 51 మంది కలెక్టర్ల ప్రస్థానం

ఖమ్మం జిల్లా ఆవిర్భవించి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పరిపాలనా ప్రస్థానాన్ని అధికారులు గుర్తుచేసుకున్నారు. 1953 OCT 1న జిల్లా ఏర్పడగా, ఇప్పటివరకు 51మంది కలెక్టర్లు సేవలందించారు. తొలి కలెక్టర్గా జి.వి. భట్ బాధ్యతలు చేపట్టగా, ప్రస్తుతం అనుదీప్ దురిశెట్టి కొనసాగుతున్నారు. వీరిలో ఎ. గిరిధర్ అత్యధికంగా 4 ఏళ్ల 21 రోజుల పాటు కలెక్టరుగా పనిచేసి రికార్డు సృష్టించారు.
News January 6, 2026
భూ కబ్జాలపై విచారణకు ఖమ్మం కలెక్టర్ ఆదేశం

తమ భూములను అక్రమంగా కబ్జా చేశారని, న్యాయం చేయాలని కోరుతూ పలువురు వృద్ధ మహిళలు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజను వేడుకున్నారు. ఏళ్ల తరబడి తమ స్థలాల కోసం ఎదురుచూస్తున్నామని, కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.


