News March 24, 2025
KTDM: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ పెంపు

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ ఈనెల 31కి పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని పెంచింది. దీంతో జూన్ చివరిదాకా అక్రిడేషన్ కార్డులు చెల్లుబాటు కానున్నాయి. అక్రిడేషన్ కార్డులను ఆయా జిల్లాల డీపీఆర్ఓల వద్ద మూడు నెలలు పొడగింపుకు సంబంధించిన స్టిక్కర్‌తో బస్సు పాసులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News December 16, 2025
కరీంనగర్: పల్లె పిలుస్తోంది.. ప్రగతి కోరుతోంది..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల కోలాహలం తుది దశకు చేరుకుంది. బుధవారం ఉ. 7 గంటల నుంచి మ. ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుండగా, మ. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే విద్యావంతులైన యువత భాగస్వామ్యం అవసరం. ఉద్యోగ, ఉపాధి రీత్యా పట్టణాల్లో స్థిరపడిన యువత ఈ ఒక్కరోజు సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలని గ్రామపెద్దలు కోరుతున్నారు.
News December 16, 2025
జిల్లాలో మూడో విడత పోరుకు సిద్ధం

సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఏడు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలకు గాను, ఇప్పటికే 22 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 సర్పంచ్ స్థానాలకు, 1,061 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 1,176 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 4,750 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
News December 16, 2025
కరీంనగర్: 454 మందికి రేపు అగ్ని పరీక్ష

కరీంనగర్ జిల్లాలో మూడో దఫా గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 108 గ్రామాలలో 454 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడుతున్నారు. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 సర్పంచ్, 1034 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు మండలాలలో 1,59,647 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


