News December 24, 2024
KTDM: తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: రేంజర్
వెంకటాపురం మండలంలో పెద్దపులి సంచరిస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రేంజర్ చంద్రమౌళి అన్నారు. వెంకటాపురంలోని పలు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుందని, వాగు వద్ద నీరు తాగిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాల కారణంగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.
Similar News
News December 26, 2024
2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి
2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.
News December 26, 2024
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?
జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.
News December 26, 2024
30న భద్రాద్రి రామాలయ హుండీ లెక్కింపు: ఈవో
భద్రాద్రి రామాలయంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఈ నెల 30న లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 26న హుండీ లెక్కింపు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తరువాత ఈ నెల 30కు లెక్కింపు కార్యక్రమాన్ని మార్చడం జరిగిందన్నారు. ఉ.8 గంటలకు దేవస్థానంలోని చిత్రకూట మండపంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.