News March 12, 2025
KTDM: నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి GOOD NEWS

తెలంగాణ నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కింద సంక్షేమశాఖ, SC, ST, BC, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రూ.6వేల కోట్లతో ఈ పథకం రూపొందించామని డిప్యూటీ సీఎం చెప్పారు.
Similar News
News January 14, 2026
పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.
News January 14, 2026
అన్నమయ్య: మద్యం బాటిల్స్‌పై ధర పెంపు.!

అన్నమయ్య జిల్లాలో గతనెల 1,12,282 కేసుల లిక్కర్ (IML), 49,398 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.78.16 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9216 కేసులు లిక్కర్, 3936 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.6.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ పరిస్థితుల్లో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.
News January 14, 2026
సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు?

సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక పురాణ, ఆరోగ్య, చారిత్రక కారణాలున్నాయి. రామాయణం ప్రకారం రాముడు తొలిసారిగా ఈ రోజునే గాలిపటం ఎగురవేశారని నమ్మకం. చలికాలంలో ఎండలో గాలిపటాలు ఎగురవేస్తే శరీరానికి కావాల్సిన విటమిన్-డి అందుతుంది. ఇదొక శారీరక వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. చైనాలో పుట్టిన ఈ గాలిపటాల సంప్రదాయం, కాలక్రమేణా సందేశాల రవాణా నుంచి ఉత్సాహభరితమైన వేడుకగా రూపాంతరం చెంది అందరినీ అలరిస్తోంది.


