News April 14, 2025
KTDM: నేడు ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

నేడు అంబేద్కర్ జయంతి ఉన్నందున కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం తెలిపారు. ప్రజలెవరు ఐడిఓసి కార్యాలయానికి రావద్దని కోరారు. వచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News December 18, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా ఎన్నికలు అందరికీ కృతజ్ఞతలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవడంతో సహకరించిన అందరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్, పలు అధికారులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించిన ఓటర్ల సహకారం అభినందనీయమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 18, 2025
నాణ్యమైన నిద్ర కోసం 10-3-2-1-0 రూల్!

10-3-2-1-0 రూల్‌తో నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది. నిద్రకు 10 గంటల ముందు కెఫిన్ ఉండే పదార్ధాలను (టీ, కాఫీ) తీసుకోవద్దు. 3 గంటల ముందే భోజనం చేయాలి. ఆల్కహాల్ తాగొద్దు. 2 గంటల ముందు పని, ఒత్తిడికి ఫుల్స్టాప్ పెట్టాలి. గంట ముందు మొబైల్/ల్యాప్‌టాప్ స్క్రీన్ ఆఫ్ చేయాలి. మార్నింగ్ అలారం మోగిన వెంటనే లేవాలి. స్నూజ్ బటన్ ఉపయోగించొద్దు. ఈ రూల్స్‌తో నిద్ర నాణ్యత పెరిగి రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు. ప్రయత్నించండి!
News December 18, 2025
రేపు గవర్నర్‌తో భేటీ కానున్న జగన్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా రేపు మధ్యాహ్నం వైసీపీ అధ్యక్షుడు జగన్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. ప్రజలు చేసిన సంతకాల పత్రాలను గవర్నర్‌కి అందిస్తారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.


