News March 19, 2024
KTDM: ప్రిన్సిపల్ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన..!

ప్రిన్సిపల్, సహాయకులు విద్యార్థినుల హాస్టల్లోకి వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారంటూ భద్రాద్రి జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపల్ విద్యార్థినులుండే హాస్టల్కు రాత్రివేళ సిబ్బందితో వచ్చి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరితో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్ వివరణిస్తూ.. ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు.
Similar News
News December 7, 2025
మూడో విడత ఎన్నికలు.. 906 నామినేషన్లు ఆమోదం

ఖమ్మం జిల్లాలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 7 మండలాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో సర్పంచ్ 906, వార్డుల స్థానాలకు దాఖలైన 4010 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈనెల 9న మధ్యాహ్నం 3 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
News December 7, 2025
రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.
News December 7, 2025
ఏకగ్రీవ పంచాయతీలలోనూ ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఈ ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


