News July 19, 2024
KTDM: వాగులో చేపలకు వెళ్లి మరో వ్యక్తి గల్లంతు

పోలవరం సమీపంలో ఉన్న పాల కాలువలో శుక్రవారం గిరిజనుడు గల్లంతయ్యాడు. వెలమలకోటకి చెందిన వెంకన్న దోర (40) చేపలు పడుతుండగా వాగులో ఒక్కసారిగా వరద ఉద్ధృతికి పెరగడంతో కొట్టుకు పోయాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News December 10, 2025
టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.
News December 10, 2025
మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

డిసెంబర్ 11న జరిగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 7మండలాల పరిధిలో 172పంచాయతీలు, 1,740వార్డులలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే కేంద్రాల్లో ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 2,41,137మంది ఓటర్లు ఉండగా, 20 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 360క్రిటికల్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 162సెన్సిటివ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.
News December 10, 2025
‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.


